ktr tested corona postive todayదేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. డైలీ కేసులు మూడు లక్షల ముప్పై వేలకు వైగా ఉన్నాయి. రిపోర్ట్ చెయ్యని కేసులు అయితే అందుకు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటాయని అంచనా. తెలంగాణలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఆక్సిజన్ కొరత, మందుల కొరత… బెడ్లు దొరకకపోవడం వంటి వాటితో అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి.

ఇటువంటి సమయంలో తెలంగాణలో నాయకత్వ లేమి కలిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. పూర్తి సమయం ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ మంత్రి కేటీఆర్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

అయితే ఈరోజు మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేడు ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం లో నెంబర్ వన్, నెంబర్ టు మాత్రమే ఉంటారు. తరువాత స్థానాలు అన్నీ ఖాళీనే. ఈ క్రమంలో ఇద్దరు కరోనా బారిన పడటంతో కీలక సమయంలో అధికారుల చేతిలోనే పాలన పడిపోయింది. అయితే ఇద్దరు బాగోనప్పటికీ శక్తిమేర అధికారులతో మాట్లాడి అవసరమైన విషయాలలో దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం.