KTR-Writes-off-Lagadapati-Survey-as-Chilaka-Josyam!తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు 17న జరుపుకోబోతున్నారు. రెండవ సారి గెలిచి అధికారంలోకి వచ్చాకా ఇది ఆయన మొదటి పుట్టిన రోజు. ఇప్పటివరకు కేబినెట్ విస్తరణ కూడా చేయకపోవడంతో ఆయన పుట్టినరోజు నాడు భారీగా హడావిడి చేసి అధినేత కళ్ళలో పడాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారైతే ఏకంగా జలవిహార్ ను బుక్ చేసి భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ మాత్రం ఎటువంటి హంగామా వద్దని పిలుపునిచ్చారు.

“17న గౌరవ ముఖ్యమంత్రి జన్మదినం. ఆ రోజున బెన్నర్లు, పత్రికలలో యాడ్ల పేరుతో డబ్బులు వేస్ట్ చెయ్యవద్దని తెరాస నాయకులకు, క్యాడర్ కు వినతి. దానికి బదులు ముఖ్యమంత్రి పేరు మీద మొక్కలు నాటండి. ఆ రకంగా మన ముఖ్యమంత్రి మీద మనకున్న మమకారం చూపిద్దాం,” అని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో కాసేపటి క్రితం పిలుపునిచ్చారు. అయితే ఇటువంటి విషయాలలో కేటీఆర్ మాట వినే పరిస్థితి ఉంటుందా? సహజంగా అయితే లేదనే చెప్పాలి.

మరోవైపు రేపటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమలు లోకి రాబోతుంది. అదైనా నాయకుల అత్యోత్సాహానికి బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి. ఇంకో వైపు కేసీఆర్ తన పుట్టినరోజుకు ఒక్క రోజు ముందు అంటే 16న మంత్రి వర్గ విస్తరణ చేస్తారని పత్రికలలో వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఇటువంటి తారీఖులు ఎన్నో వినిపించి మళ్ళీ మాయం అయిపోయాయి. ఈ క్రమంలో ఈ సారైనా ఏం జరుగుతుందో చూడాలి. కేసీఆర్ తో కలిపి ఒకే మంత్రితో పాలన సాగించడంతో అన్ని శాఖలలో గుట్టల కొద్ది ఫైళ్లు నిలిచిపోయాయని సమాచారం.