KTR struggles with Hyderabad roadsహైదరాబాద్ సిటీ ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఎప్పటిలానే వాహనదారులు నరకాన్ని మన రోడ్లు భువీ పైనే పరిచయం చేశాయి. మునిసిపల్ మినిస్టర్, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, కేటీఆర్‌ దీనిపై స్పందించారు. ఐతే ఆయన స్టేట్మెంట్ప్రజలకి ఏమాత్రం భరోసా కల్పించలేదు అనే చెప్పుకోవాలి.

“హైదరాబాద్‌ రోడ్లు బాగాలేవని చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు, జంటనగరాల అభివృద్ధికి కొంత సమయం పడుతుంది. నిన్న నా కుమారుడు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు, నా కుటుంబం కూడా ఈ రోడ్లపైనే తిరుగుతోంది,” అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ఐతే ఇలాంటి భెలా మాటల వల్ల ఉపయోగం ఏంటి అనేది ఆయనే ఆలోచించుకోవాలి?

2004 తరువాత హైదరాబాద్‌ రోడ్లు ఎన్నడు ఇంత ఆధ్వాన్నంగా లేవు. తెలంగాణా వచ్చి మూడు ఏళ్లు అయ్యింది, అలాగే కేసీఆర్ గవ్ర్నమెంటుకు మూడేళ్లు నిండాయి. ఇలాంటి నిసహాయ మాటలు ఎన్నిరోజులు ప్రజలు వినగలరు? పరిస్థితి ఇలానే ఉంటే టీఆర్ఎస్ 2019లో వోట్లు అడగడం అంత తేలిక కాదు.