KTR son Himanshu comments on Katamarayudu movieహైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియా సినిమా అవార్డుల కార్యక్రమం ‘ఐఫా’లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మునిసిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ… తాను లేటెస్టుగా ‘కాటమరాయుడు’ సినిమా చూశానని హిమాన్షు చెప్పగా, ఆ సినిమా ఎలా ఉంది అంటూ యాంకర్ ప్రశ్నించగా, “అంత ఎక్కువగా ఏమీ లేదు. నార్మల్ గా ఉంది” అని హిమాన్షు జవాబిచ్చాడు.

ఇటీవల ఈ సినిమాను చూసిన సందర్భంగా పవన్ తో సెల్ఫీ ఫోటో దిగిన కేటీఆర్, ‘కాటమరాయుడు’ సినిమా బాగుందని పవన్ ను, నిర్మాత శరత్ మరార్ ను అభినందించిన విషయం తెలిసిందే. దీంతో తండ్రి నచ్చిందని చెప్పిన సినిమాను, కుమారుడు లైట్ తీసుకోవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటి షేరింగ్ అకౌంట్స్ లో… ‘కాటమరాయుడు’పై హిమాన్షు మాట్లాడిన వీడియోనే ప్రస్తుతం సందడి చేస్తోంది.

ఇక, తనకు అభిమాన హీరో అంటూ ఎవరూ లేరని, అన్ని సినిమాలు చూస్తానని, ఏ సినిమా అయినా నచ్చితే మళ్ళీ మళ్ళీ చూస్తానని చెప్పాడు. అవుట్ డోర్ గేమ్స్ లో స్విమ్మింగ్ ఇష్టమని, ఇన్ డోర్ గేమ్స్ లో అన్ని వీడియో గేమ్స్ తనకు ఇష్టమని చెప్పాడు హిమాన్షు. మొత్తానికి ‘కాటమరాయుడు’ సినిమాపై చేసిన కామెంట్స్ తో ఐఫా వేడుకల్లో హైలైట్ అయ్యాడు హిమాన్షు. ప్రస్తుత జనరేషన్ కు రొటీన్ మాస్ సినిమాలు ఎక్కడం లేదనడానికి ఇదొక నిదర్శనంగా నెటిజన్లు భావిస్తున్నారు.