‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత తెలంగాణా మంత్రి కేటీఆర్ మరియు ప్రిన్స్ మహేష్ బాబుల నడుమ అనుబంధం బాగా పెరిగిందన్న విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ సినిమాకు ముందు తెలంగాణాలో సిద్దాపురం గ్రామదత్తతతో మొదలైన ఈ అనుబంధం రోజురోజుకూ అంతకంతకూ బలపడుతోంది. అయితే తాజాగా మహేష్ ను ఇరకాటంలో నెట్టారు కేటీఆర్.
ఇటీవల రాజమౌళి విసిరిన ‘మొక్కలు నాటే’ ఛాలెంజ్ ను పూర్తి చేసిన మంత్రివర్యులు, ఆ తర్వాత మహేష్ బాబుకు ఈ ఛాలెంజ్ విసిరారు. ప్రిన్స్ తో పాటు కేతేరిన్ హడ్డా మరియు సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాజ్ దీప్ సర్దేషి వంటి క్రికెటర్లను కూడా నామినేట్ చేసారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలన్నది ఈ టాస్క్ ఛాలెంజ్.
కేటీఆర్ ఆహ్వానించిన ఇతరులందరూ ఈ పని చేసేవారే గానీ, మహేష్ కు మాత్రం ఇలా ఛాలెంజ్ లు స్వీకరించి, టాస్క్ లను కంప్లీట్ చేయడమంటే బహు సిగ్గు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ను కూడా ప్రిన్స్ లైట్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ‘గ్రీన్ ఛాలెంజ్’ ప్రకృతికి సంబంధించినది కావడంతో మహేష్ ముందడుగు వేస్తారేమో చూడాలి.
Task accomplished @ssrajamouli Garu. Planted a Rosewood, Oak & Golden champa saplings. Now I invite @urstrulyMahesh @USCGHyderabad @sachin_rt @VVSLaxman281 and @sardesairajdeep to the green challenge. Each one plant three 👍 pic.twitter.com/QJhv264Ipi
— KTR (@KTRTRS) July 27, 2018