KTR got  'Leader of the year' awardజాతీయ వారపత్రిక ‘బిజినెస్ వరల్డ్’ తెలంగాణ ఐటీ మంత్రి తారక రామారావుని ‘లీడర్ అఫ్ ది ఇయర్’ గా ప్రకటించింది. ఢిల్లీలో ఈ నెల 20న జరగబోయే అవార్డుల ప్రధానోత్సవంకు స్వయంగా హాజరయ్యి ఈ అవార్డును అందుకోనున్నారు ఆయన. ఈ వార్త బయటకు వచ్చిన నాటి నుండి ట్విట్టర్ లో హంగామా అంత ఇంతా కాదు అనే చెప్పుకోవాలి.

ప్రత్యేకించి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పోటీపడి మరి కేటీఆర్ ను అభినందిస్తున్నారు. ఇది మొత్తానికి పరిశ్రమకు సంబందించిన విషయం కాకపోయినా హైదరాబాద్ తో తెలంగాణ ప్రభుత్వంతో గల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వారు అంతగా ఎక్సైట్ అవుతున్నారనే విషయం అందరికి తెలిసిందే.

అంత మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అదే సమయంలో ఆంధ్ర రాజధాని అమరావతికి అద్భుతమైన తెలుగు తల్లి తొలి కిరణం కాన్సెప్ట్ ను ఇచ్చిన రాజమౌళిని మాత్రం అభినందించిన వారు లేరు. పొగిడితే తాము ఆంధ్రావారిగా కనపడతాము అని వారి భయం కావొచ్చు.

భవిష్యత్తు అవసరాలు దృష్ట్యా పరిశ్రమ ప్రముఖులందరూ తమను తాము తెలంగాణవాదులుగా చిత్రీకరించుకునే పని ఉన్నారు. పరిశ్రమ ప్రముఖుడుగా చెప్పుకునే తమ్మారెడ్డి భరద్వాజా ఇటీవలే తామంతా కేసీఆర్ పాలనలో చల్లగా ఉన్నామని, ఆంధ్ర రావాల్సిన అవసరం లేదని అనడం దీనికే సంకేతం?