KTR-Solid-Retort-to-Congressman-on-Twitterపెట్టుబడి సాయంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యింది. రెండు విడతలుగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి ప్రభుత్వం ఏడాదికి 8000 రూపాయిలు ఇవ్వడం ఈ స్కీం ఉద్దేశం. దాదాపుగా 58 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకంతో లాభపడనున్నాయి.

మొదటి విడతగా 5730.80 కోట్లు పంపిణీ కాబోతున్నాయి. అయితే ఈ కోలాహలంతో మంత్రి కేటీఆర్ ను ఒక సాధారణ కిరాణా వ్యాపారి తన వాట్సాఅప్ మెసేజ్ ద్వారా కదిలించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని దీని కోసం తాను కూడా తన వైపు నుండి 8000 రూపాయిలు ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిపారు.

అనిల్ అనే ఆ వ్యాపారి ఉప్పల్ నివాసి. 4000 వెంటనే పంపుతా అని, మిగిలిన సొమ్ము వచ్చే నెల పంపుతా అని చెప్పిన ఆ చిరు వ్యాపారికి కేటీఆర్ హ్యాట్సాఫ్ చెప్పారు. మరోవైపు బాగా డబ్బున్న రైతులు ఈ సాయాన్ని స్వచ్చందంగా వదులుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. తద్వారా అవసరమైన రైతులకు ఆ సాయం అందేలా చేసినట్టు అవుతుందని ప్రభుత్వం చెప్పింది.