KTR Apologizes for Denying Way for Ambulanceపెట్టుబడి సాయంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యింది. రెండు విడతలుగా ప్రతి ఎకరాకు సంవత్సరానికి ప్రభుత్వం ఏడాదికి 8000 రూపాయిలు ఇవ్వడం ఈ స్కీం ఉద్దేశం. దాదాపుగా 58 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకంతో లాభపడనున్నాయి.

స్కీం ఆశయం గొప్పదైనా దీని కోసం దేశంలో ఉన్న పత్రికలు అన్నిటిలోనూ కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇవ్వడం వివాదాస్పదం అయ్యింది. తెలంగాణ బీజేపీ దీనిగురించి పెట్టిన ఒక ట్విట్టర్ పోస్టుకు కేటీఆర్ ఘాటుగా రియాక్టు అయ్యారు. తమ పాలిత రాష్ట్రాలలో కూడా ఇటువంటి డిమాండ్ వస్తుందని బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేసారు.

“తెలంగాణలోని చాలా స్కీంలను బీజేపీ ఫలిత రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. ఇటీవలే కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాటిని పెట్టారు. తప్పేమి కాదు. మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు,” అన్నారు. రైతు కోసం జరిగే మంచి పని ..ఎక్కడ జరిగినా దేశమంతా తెలియాలి..అన్ని ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగాలి. మొత్తంగా అన్నదాతకు మేలు కలగాలి అని ఒకరు పెట్టిన ట్వీట్ ను కూడా ఆయన రీట్వీట్ చేసారు.