Uppena-Girl-Stealing-Hearts-Even-Before-Debut-Showతన మొదటి సినిమా ఉప్పెనతో ప్రేక్షకులను కట్టిపడేసింది కృతి శెట్టి. అందం, అభినయంతో పాటు మొదటి సినిమాకే తెలుగు అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుని ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు రెండు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. నాని శ్యామ్ సింఘా రాయ్ మరియు ఇంద్రగంటి – సుధీర్ బాబు సినిమాలను ఒకే చేసింది ఈ అమ్మడు.

తాజాగా ఆమె మరో సినిమా సైన్ చేసిందట. తమిళ దర్శకుడు లింగుస్వామి తో రామ్ చెయ్యబోతున్న కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా సైన్ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ అమ్మడు క్రేజీ ప్రాజెక్టులే పట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించడమే తరువాయి.

లింగుస్వామి ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని తెలిసింది. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు. హీరో రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ ఇస్మార్ట్ శంకర్ తో తన కెరీర్ లోనే పెద్ద బ్రేక్ అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన రెడ్ సినిమా సంక్రాంతి అడ్వాంటేజ్ కారణంగా బాగానే వసూళ్లు రాబట్టింది. అయితే లింగస్వామి ఈ మధ్య కాలంలో ఫామ్ లో లేరు. అయినా ఆయనకు రామ్ అవకాశం ఇవ్వడం విశేషం.