Krishnarjuna Yuddham Dhaari Choodu Songనాచురల్ స్టార్ నాని నటించిన “కృష్ణార్జున యుద్ధం”లో రెండు పాత్రలను పరిచయం చేయగా, నేడు సింగిల్ ట్రాక్ ను విడుదల చేసారు. ‘దారి చూడు దుమ్ము చూడు మామ’ అంటూ సాగిన ఈ పాట మొత్తం తమిళ్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఊర మాస్ బాణీగా సాగిన ఈ పాటలో పెంచాల్ దాస్ స్వరం హైలైట్ గా నిలుస్తుంది. మాస్ ఆడియన్స్ కు పండగ లాంటి పాటగా అభివర్ణించవచ్చు. పాటకు తగ్గట్లుగానే నాని ఇచ్చిన మాసీ ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేలా ఉన్నాయి.

‘ధృవ’ ఫేం హిప్ హాప్ సంగీతం అందించిన ఈ పాటకు స్వరాలు అందించింది మరియు స్వరం వినిపించింది పెంచాల్ దాస్ కావడం విశేషం. మొత్తానికి సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసిన మూడు ప్రయత్నాలు నానికి బాగానే వర్కౌట్ అయినట్లుగా పేర్కొనవచ్చు. ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం కానున్న ఈ సినిమా పబ్లిసిటీలో ముందుంది. ఫస్ట్ సాంగ్ కృష్ణుడు రోల్ ది విడుదల చేసారు కాబట్టి, రెండవ పాట అర్జున్ రోల్ లో పక్కా క్లాస్ సాంగ్ ను రిలీజ్ చేస్తారేమో చూడాలి.