krishna-gadi-veerapremagadha-trailer-talkనాని హీరోగా నటించిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. టీజర్ లో నాని చెప్పినట్లుగా రెండున్నర్ర గంటల సినిమాను 30 సెకన్లలో చెప్పడం కష్టమనే విధంగా టీజర్ ఉంది.

టీజర్ గురించి చెప్పడానికి ఏం లేదు గానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ కు కొనసాగింపుగా ఈ ఫస్ట్ టీజర్ ఉంది. అయితే టైటిల్ ఆవిష్కరించిన విధానం, దర్శకనిర్మాతల పేర్లు పడ్డ విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆడియో విడుదల ముహూర్తాన్ని ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజు ధియేటిరికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.