Krack - REDసంక్రాంతి తెలుగు సినిమా ట్రేడ్లో అతిపెద్ద సీజన్. ఆ సీజన్లో సెలవుల వల్ల, పండుగ కోలాహలం వల్ల విడుదలయ్యే ప్రతి సినిమా రేంజ్ పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పై కోవిడ్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి. దానికి భయపడి పెద్ద సినిమాలు పండుగ సీజన్లో ముఖం చాటేశాయి.

మాస్ మహారాజా రవితేజ యొక్క క్రాక్, ఎనర్జిటిక్ హీరో రామ్ రెడ్, మరియు విజయ్ మాస్టర్ (డబ్బింగ్ సినిమా) ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల కానున్న మూడు పెద్ద సినిమాలు. క్రాక్ మరియు రెడ్ జనవరి 14 న విడుదల చెయ్యనున్నట్టు ఆయా సినిమా జట్లు ఇప్పటికే ప్రకటించాయి. అదే రోజున మాస్టర్ కూడా విడుదల చేయబోతున్నారని బజ్.

అంటే ఒకే రోజు మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. పండుగ సీజన్ కోసం ఇంకో రెండు లేదా మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మామూలు రోజుల్లోనే ఒకే రోజున మూడు సినిమాలకు థియేటర్లు చూపించడం చాలా కష్టం. ఇప్పుడు, కొన్ని థియేటర్లు మూసివేయబడే అవకాశం ఉన్న కోవిడ్ సమయం గురించి మాట్లాడుతున్నాము. ఏమి జరుగుతుందో చూద్దాం.

ప్రస్తుత పరిస్థితిని బట్టి 50% ఆక్యుపెన్సీ నియమం పండుగ సీజన్లో కూడా కొనసాగుతుంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ కోవిడ్ తరువాత తెలుగులో విడుదలైన మొదటి పెద్ద సినిమా. ఆ సినిమాకు ప్రేక్షకుల రెస్పాన్స్ బావుంది. దీనితో, సంక్రాంతి విడుదలల చిత్రనిర్మాతలు పండుగ సీజన్‌లో మరింత తమ సినిమాలను ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని ఆశిస్తున్నారు.