krack-super hitమాస్ మహారాజా రవితేజ క్రాక్ సంక్రాంతి కంటే ముందే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి తెచ్చేసింది. కొన్ని చోట్ల 50% ఆకుపెన్సి రూల్ ఇబ్బంది పెట్టినప్పటికీ రవితేజ కేరీర్ బెస్ట్ రిలీజ్ కావడంతో భారీ ఓపెనింగ్ వచ్చింది. రవితేజ చివరి సినిమా డిస్కో రాజా కంటే రెండు మూడు రేట్లు మొదటి రోజు రెవిన్యూ వచ్చి ఉంటుందని అంచనా.

నిజానికి క్రాక్ శనివారం విడుదల కావాల్సింది. అయితే ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల ఆ రోజు రాత్రి కొన్ని చోట్ల సెకండ్ షోలు మాత్రమే పడ్డాయి. ఆ రోజంతా ఇదిగో సినిమా అదిగో సినిమా అంటూ వాయిదా పడుతూ వచ్చినా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వస్తూనే ఉన్నారు. అలాగే ఆదివారం అతిపెద్ద ఓపెనింగ్ ఇచ్చేశారు.

చాలా మంది ఇండస్ట్రీ వారు ప్రేక్షకులను ప్రేక్షకదేవుళ్లు అని సంబోధిస్తారు… అది ఎందుకో ఇప్పుడు అర్ధం అయ్యి ఉంటుంది. కరోనా కారణంగా ఇండస్ట్రీ పరిస్థితి ఆగమాయాగోచరంగా మారింది. 50% ఆకుపెన్సి కారణంగా చాలా థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లు షేరింగ్ బేసిస్ లో సినిమాని విడుదల చేశారు. అయినా పెద్ద పెద్ద నంబర్లు వచ్చాయి.

చిన్న సెంటర్లలో కూడా ప్రేక్షకులు బారులు తీరడంతో మిగిలిన సంక్రాంతి సినిమాలకు కూడా భారీ కలెక్షన్లు ఖాయం అని తెలుస్తుంది. మొత్తానికి ఈ సీజన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ వేవ్ ఈ వేవ్ అంటూ కరోనా మళ్ళీ ఇబ్బంది పెట్టకపోతే ఇండస్ట్రీ తొందరలో కోలుకోవడం ఖాయం.