Kothapalli Geetha new political partyకొత్తపల్లి గీత… 2014లో వైకాపా తరఫున అరకు నుంచి ఎంపీగా ఎన్నికైన గీత.. ఆ తరువాతి కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మొదట్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆమె తరువాత ఆ పార్టీని విమర్శిస్తూ బీజేపీకి దగ్గరైనట్టుగా వ్యవహరించారు. ఇటీవలే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వైకాపా నాయకత్వానికి లేఖ పంపారు.

జనసేనలో చేరడం ఆమె అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు బుధవారం ఆమె తెలిపారు. విజయవాడలో పాత్రికేయుల సమావేశంలో పార్టీని లాంఛనంగా ప్రకటించనున్నట్లు ఆమె వెల్లడించారు.

అరకు పార్లమెంట్ లో గీత స్వయంగా పోటీ చేసి గెలిచే సత్తా లేదు అటువంటిది సొంత పార్టీ ఏంటో మరి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే అంత తేలిక కాదని గతంలోనే దేవేందర్ గౌడ్, చిరంజీవి లాంటి వాళ్ళు ప్రూవ్ చేసారు. ఈ తరుణంలో గీత ఏం చేస్తారో?