తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు ఆయన.. క్యారక్టర్ ఏదైనా సరే ఆయన చేశారంటే పాత్రకి ప్రాణం వచ్చినట్టే. ఇచ్చిన పాత్ర ఎలాంటిదైనా దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయడం ఆయన వంతు. తెలుగు సినిమా చరిత్రలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. ఆయనే విలక్షణ నటుడు కోటా శ్రీనివాస రావు. కామెడీ, విలనిజం, తండ్రి, మామ అబ్బో దాదాపు 750 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించారు కోటా శ్రీనివాస రావు.
వయసు మీద పడినా సరే సినిమా మీద ఉన్న ప్రీతి తో ఈమధ్య అడపాదడపా మాత్రమే జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇదంతా ఆయన సిని ప్రస్థానం కాగా ఆయనకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా కొన్ని వార్తలు ఈమధ్య మీడియాలో కనిపిస్తున్నాయి. అలా ఎందుకు సినిమాలేవి చేయక ఖాళీగా ఉన్న కోటా గారిని కొంతమంది యూట్యూబర్స్ కావాలని వెళ్లి మరి ఆయన చేత ఇంటర్వ్యూస్ చేస్తున్నారు.
75 ఏళ్ల కోటా శ్రీనివాస రావు ని ఆయనకు ఓపిక ఉన్నా లేకపోయినా కావాలని వెళ్లి ఆయనతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ముఖాముఖి చేస్తున్నాయి. వయసు రీత్యా వచ్చిన చాదస్తంతో ఆయన ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. ఈ క్రమంలో చరణ్ కి నటన రాదని.. ఎన్.టి.ఆర్ చంద్రమోహన్ లానే పొట్టోడని చెప్పుకొచ్చారు. యూట్యూబ్ ఛానెల్స్ వారి వ్యూస్ కోసం కోటా గారి దగ్గరకు వెళ్లి పనికట్టుకుని ఇలాంటి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. కోటా గారి కామెంట్స్ కు ఆకట్టుకునే థమ్ నైల్స్ పెట్టి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
కోటా గారి కామెంట్స్ కి హీరోల మధ్య రగడ మొదలైంది. ఒక హీరో గురించి కోటా ఇలా అన్నారని యాంటీ ఫ్యాన్స్.. మీ హీరో గురించి కూడా అన్నారని మరో హీరో ఫ్యాన్స్ ఇలా మళ్లీ వారి వీరాభిమానంతో సోషల్ మీడియాలో తగువులాడుతున్నారు. ఈ వయసులో ఆయన ప్రైవసీని దెబ్బతీస్తూ ఇంటర్వ్యూస్ అంటూ ఆయన్ని ఇబ్బంది పెడుతున్న యూట్యూబ్ ఛానెళ్లదే మొత్తం తప్పని కొందరు అంటున్నమాట. వీరే కావాలని కోటా గారి చేత అలా మాట్లాడిస్తున్నారని చెప్పొచ్చు.
NTR Arts: Terrified NTR Fans Can Relax!
You’re Good for Only Exposing: Actress Responds