Koratala Siva Tweets on Politicsతన సినిమాలలో సామాజిక సందేశాలను ఇవ్వడం పరిపాటిగా మార్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా “భరత్ అనే నేను” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రిన్స్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఆగష్టు 10వ తేదీ నుండి మలి షెడ్యూల్ లక్నోలో జరగనుంది. రాజకీయ కోణంలో చిత్రీకరణ జరుపుకోబోతున్న ఈ సినిమా ద్వారా కొరటాల ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

చూడబోతుంటే… ఈ సారి కొరటాల లక్ష్యం చాలా పెద్దదిగా కనపడుతోంది. అవును… అందుకు ప్రతీకగానే రాజకీయాలపై ట్వీట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినీ ప్రచారాలకు తప్ప పెద్దగా ఉపయోగించని సోషల్ మీడియాను, ప్రస్తుతం రాజకీయ కామెంట్లతో వేడెక్కిస్తున్నాడు కొరటాల. “ప్రస్తుతం రాజకీయాలు చాలా దరిద్రంగా మారిపోయాయి, దేవుడు కూడా వాటిని రక్షించలేడు, కానీ మనం మార్చగలం, మనం మాత్రమే…” అంటూ చేసిన ట్వీట్ కు అర్ధం బహుశా “భరత్ అనే నేను” సినిమాలో ఉంటుందేమో చూడాలి.

రాజకీయాలపై కొరటాల అస్త్రం ఎక్కుపెట్టినట్లే కనపడుతున్నాడు. దీంతో ‘భరత్ అనే నేను’లో పదునైన డైలాగ్స్ కు కొదవ ఉండవన్న సంకేతాలు వచ్చేసాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాతో కొరటాల సక్సెస్ అయితే, రాజమౌళి తర్వాత స్థానంలో కొరటాల చేరిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో “భరత్ అనే నేను” సినిమా సందేశం పరంగానే కాదు, కొరటాల కెరీర్ పరంగా కూడా ఓ భారీ లక్ష్యాన్నే ఏర్పరచుకున్నారని అర్ధమవుతోంది. అయితే ఇదే సంక్రాంతి రేసులో “రంగస్థలం”తో పాటు పవన్ – త్రివిక్రమ్ ల సినిమా కూడా ఉండనుం