Koratala Siva Takes Responsibility For That Buzz In Acharyaకొరటాల శివ చివరి చిత్రం భరత్ అనే నేను సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైంది. చిరంజీవితో అతని తదుపరి చిత్రం వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. చిరంజీవి సైరా షూటింగ్ డిలే అవ్వడంతో ఆచార్య చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు, కరోనా లాక్డౌన్ కారణంగా మరోసారి సినిమా షూటింగ్ ఆలస్యం అయింది.

ఆచార్యను స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా ఆగస్టు 14 న విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ సంక్రాంతి రేసులో లేనట్లయితే, ఈ చిత్రం సంక్రాంతికి వాయిదా పడుతుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా కొరటాల తన తదుపరి చిత్రం కథను నిర్ణయించడానికి ఈ లాక్డౌన్ విరామాన్ని ఉపయోగిస్తున్నారు.

ఆచార్య విడుదలైన వెంటనే ఈ చిత్రం సెట్స్‌లోకి వెళ్లేలా ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. లాక్డౌన్ ముగిసే సమయానికి అతను బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తాడు.ఇదివరకు ఎన్టీఆర్ తో తన తదుపరి చిత్రాన్ని తీస్తానని ఇంతకు ముందే చెప్పినప్పటికీ, ఇప్పుడు అతను ఏ స్టార్ నూ దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాయడం లేదు.

ఆచార్య విడుదల సమయానికి ఏ హీరో డేట్స్ సులభంగా అందుబాటులో ఉంటే అతనితో పని చేస్తాడు. కొరటాల చాలా కాలం క్రితమే కొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాడు. వీలైనంత తొందరగా వాటిని తెరమీదకు ఎక్కించకపోతే అవి అవుట్ డేట్ అయిపోయే అవకాశం ఉండటంతో ఆయన కంగారుగా ఉన్నాడు.