కొరటాల శివ దర్శకత్వం వహించిన “భరత్ అనే నేను” మరికొద్ది గంటల్లో ఫస్ట్ షో పడనుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ అండ్ మహేష్ బాబులతో కూడిన ఓ ఇంటర్వ్యూ అన్ని మీడియాలలో హంగామా చేస్తోంది. ‘భరత్ అనే నేను’కు సంబంధించిన ముచ్చట్లలలో భాగంగా ఈ సినిమాలోని పాటల గురించి కొరటాల ప్రత్యేకించి చెప్పారు.
ఈ సినిమాలో ఉన్న ‘ఐ డోంట్ నో’ అనే పాట కేవలం ఒక పాట మాత్రమే కాదని, అది సినిమా అంతా ఉంటుందని, నిజానికి చాలా గొడవలు ‘ఐ డోంట్ నో’ అంటే ఆగిపోతాయని ఓ ప్రముఖ వ్యక్తి చెప్పారని, అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ పదం సినిమా అంతా క్యారీ అవుతుందని, సినిమాలో ఒక సీన్ లో ‘ఐ నో’ కూడా మహేష్ చెప్తాడని, ‘ఐ డోంట్ నో’ ప్రాధాన్యతను వివరించారు కొరటాల.
ఈ సినిమాలో చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయని, అయితే లెంగ్త్ రీత్యా వాటిని తొలగించక తప్పని పరిస్థితి నెలకొందని ప్రిన్స్ తెలిపారు. సినిమాలో ప్రతి సీన్ ను మూడు, నాలుగు టేక్ లు చేయడం మహేష్ కు అలవాటని, ‘ఇది ఓకే… ఇంకో టేక్…’ అనడం మాకు రెగ్యులర్ గా సెట్స్ లో అలవాటైన పదమని మహేష్ గురించి కొరటాల శివ చమత్కరించారు.