konideala niharikaత్వరలో సిల్వర్ స్క్రీన్ పైన ‘ఒక మనసు’ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న మెగా వారసురాలు నిహారిక, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినీ అనుభవాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రస్తావించారు. ఒక మంచి అనుభూతులు పంచే ‘ఒక మనసు’ వంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు మిక్కిలి సంతోషంగా ఉందని చెప్పిన నిహారిక, భవిష్యత్తులో మెగా హీరోలతో నటించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టింది.

ఎలాంటి రోల్స్ వచ్చినా మెగా హీరోలతో కలిసి నటించబోనని స్పష్టంగా చెప్పిన నిహారిక, ఒకవేళ నటించాల్సి వస్తే… అది మెగా కుటుంబం మొత్తం నటించే సినిమా అవ్వాలని, అప్పుడు తానూ కూడా అందులో ఒక భాగం అవుతానని, అయితే ఇది కూడా సాధ్యం అవుతుందన్న నమ్మకం తనకు లేదని, అందుకే మెగా హీరోల సినిమాలకు ‘రెడ్ సిగ్నల్’ వేస్తున్నట్లుగా నిహారిక అభిప్రాయపడ్డారు.

అయితే తానూ నటించాల్సిన మొదటి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారిదైన ‘అంజి’ అని, ఈ సినిమాలో ఒక పది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని, అయితే వీళ్ళు మరీ చిన్న పిల్లలుగా ఉన్నారు, కాస్త వయసు పెరిగిన వారితో అవే సీన్లు తీద్దామని మమ్మల్ని ఆ సినిమా నుండి తీసేసారని, లేదంటే బాలనటిగా అయినా చిరు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చేదానిని చెప్పుకొచ్చింది నిహారిక.