Konidela-Nagababu-YS-Vijayammaవైసీపీ _ జనసేన, నేతల మధ్య కన్నా, కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అధికార పార్టీ కౌంటర్లకు ఏమాత్రం తగ్గేదెలే అన్న చందంగా జనసైనికుల నుండి కౌంటర్ అటాక్స్ సిద్ధంగా ఉంటాయి.

తాజాగా జనసేన నేత నాగబాబు అధికార పార్టీని ఉద్దేశించి రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తో ముఖ్యమంత్రి తానొస్ రెడ్డి డిబేట్ కి వచ్చే దమ్ముందా..? అంటూ చేసిన విమర్శలకు గాను వైసీపీ నేతలు.,కార్యకర్తలు 2019నర్సాపురం నుండి పోటీ చేసి ఒడిన తరువాత కనీసం నీకు ఓట్లేసిన ప్రజల ముఖం అయినా చూసావా నాగబాబు..? అంటూ వైసీపీ సోషల్ మీడియా సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.

Also Read – అవసరం లేనప్పుడు రివర్స్ గేర్.. ప్రమాదమేగా?

తనకింద ఉన్న మచ్చను గుర్తించలేని ‘గురివింద గింజ’ మాదిరి వైసీపీ నేతల గాభరాకి జనసైనికులు కౌంటర్లు సిద్ధం చేశారు. 2014ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన మహానేత భార్య., వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రస్తావనతో అధికార పార్టీ నేతలకు చెక్ పెట్టె పనిలో బిజీగా ఉన్నారు జనసేన కార్యకర్తలు. కనీసం తానూ పోటీ చేసిన స్థానాన్నే కాదు ఏకంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు విజయమ్మ.! మరి దానికేం సమాధానం చెపుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు జనసేన నాయకులు.

అభివృద్ధిలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొడుకుని అధికార పీట్టం ఎక్కించడం ద్వారా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి., దేశంలోనే ‘రాజధాని’ లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నడిరోడ్డు మీద నిల్చోపెట్టి.., ఇప్పుడు కూతురుతో తెలంగాణాలో పార్టీ పెట్టించి ఆ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్న మీ నాయకురాలుకంటే గొప్ప నేతలు ఎవరు ఉంటారు..? అంటూ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు జనసేన నేతలు.

Also Read – వైసీపీని విమర్శిస్తే చాలు.. టీడీపీలోకి ఎంట్రీ?

2014ఎన్నికలలో టీడీపీ పార్టీకి ప్రచారం చేసినందుకు గాను ఆ ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ను భాద్యుడ్ని చేస్తూ ముఖ్యమంత్రి తో సహా అందరు నేతలు పవన్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. మరి 2019ఎన్నికలలో జగన్ గెలుపుకు తల్లి విజయమ్మ.., చెల్లి షర్మిలమ్మ రాష్ట్ర వ్యాప్త ప్రచారాలతో జగన్ ను మించిన హంగామా చేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కుటుంబ కలహాలో., వ్యక్తిగత కారణాలో తెలియదు కానీ పక్క రాష్ట్రము వెళ్లి వైసీపీ తెలంగాణ పార్టీ అంటూ కొత్త రాగం అందుకున్నారు.

మరి ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి ఒకరకంగా తల్లి _ చెల్లి కారణం కాదా…? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు పవన్ అభిమానులు. షర్మిల అయితే కనీసం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విలేకరులు అడిగే ప్రశ్నలను వినడానికి కూడా ఇష్టపడడం లేదు. నాకు ఆంధ్రతో ఎటువంటి సంబంధం లేదు అంటూ పత్రికా సోదరుల పై తన అసహనాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. మరి ఇదెక్కడి న్యాయం..?

Also Read – మనోజ్ ‘మంచు’ ని కరిగిస్తారా.? కాపాడతారా.?

మీ వ్యక్తిగత అభిప్రాయాలతో రాష్ట్రానికి అన్యాయం చేస్తారా.? రాజధాని ఇక్కడే ఉంటుంది అంటూ ప్రచారం చేసి ఇప్పుడు నాకేం సంబంధం అంటే రాజధాని రైతుల వ్యధలు ఎవరు ఆలకిస్తారు.? వారికి న్యాయం జరిగేదేప్పుడు.? అంటూ పలు ప్రశ్నలతో కౌంటర్లను విసురుతున్నారు జనసేన నేతలు.ఇదంతా చూస్తున్న నెటిజన్లు “గిల్లి…గిల్లిచుకోవడం” అంటే ఇదేనేమో అంటున్నారు.