Kondagattu Bus Accidentతెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 5.25 కోట్లు ఖర్చు పెట్టి 21 ఐఏఎస్ అధికారులకు ఫార్చూనర్ కార్లు కొనుగోలు చేశారు. దీనిపై విమర్శలు చెలరేగితే మాది ధనిక రాష్ట్రం మేము కొనుకుంటే తప్పేంటి అని సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఘాట్‌ రోడ్డులో ఈరోజు ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో 33 మంది మహిళలు… నలుగురు చిన్నపిల్లలు కూడా ఉండటం విషాదం.

డ్రైవర్ కి అనుభవం లేకపోవడంతో పాటు బస్సు కూడా కండిషన్ లో లేదని ప్రాధమిక సమాచారం. ఐఏఎస్ అధికారులకు ఫార్చూనర్ కార్లు కొనుగోలు చెయ్యగలిగిన ధనిక రాష్ట్రం… రాష్ట్రంలోని ప్రజలకు కనీసం సరైన రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోవడం ఎవరి వైఫల్యమో? ఎప్పటిలానే మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం.