soukyam audio release in ongoleఒకే తరహా కధలతో ప్రేక్షకులను పిచ్చేక్కించే కోన వెంకట్ తాజాగా రచన సహకారం అందించిన చిత్రం “సౌఖ్యం.” గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ‘సిల్వర్ స్క్రీన్ ను టచ్ చేసింది. అయితే, మొదటి షో పడడంతోనే ఈ సినిమాను ప్రేక్షకులు తట్టుకోలేరన్న టాక్ సొంతం కావడంతో “సౌఖ్యం” సినిమా సక్సెస్ పక్క దారి పట్టింది.

‘లౌక్యం’ సినిమా టైటిల్ మార్చి, మళ్ళీ ‘సౌఖ్యం’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారన్న విమర్శలను మూట కట్టుకుంది. బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, సప్తగిరి, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి వంటి మహామహులైన కమెడియన్లను పెట్టుకుని, సినిమాలో హాస్యం పండించడంలో రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లు ఫెయిల్ అయ్యారని విశ్లేషకులు తేల్చేసారు.

‘బ్రూస్ లీ’ సినిమా ఫెయిల్ కావడానికి దర్శకుడు శ్రీను వైట్ల తానూ చెప్పింది వినలేదని, తన వర్షన్ లో సినిమా చేసి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని కోన వెంకట్ పరోక్ష విమర్శలు చేసారు. మరి ఇపుడు ‘సౌఖ్యం’ సినిమా ఫెయిల్ కావడం వెనుక ఎలాంటి కారణాలు చెప్తారో చూడాలి. ఇటీవల ‘శంకరాభరణం’ సినిమాతో ఇప్పటికే ఓ జలక్ ఇచ్చిన ప్రేక్షకులు, తాజాగా ‘సౌఖ్యం’తో అందరి కళ్ళు తెరిపించినట్లున్నారు.