kona-venkat-pawan-kalyan“నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ముందుగా పవన్ కల్యాణ్ కు చెప్పుకుంటా. ఆయన బాగా బిజీగా ఉంటారు కనుక, టైమ్ ఇచ్చినప్పుడు పవన్ ను కలిసి విన్నవించుకుంటాను. పవన్ అంతా విన్న తర్వాత… ఒకే ఒక మాటతో సమస్యకు పరిష్కారం చెప్పేస్తారు. అందుకే, మన వెనకాల ఒక శక్తి ఉంది… అంతా అది చూసుకుంటుందని అనుకుంటూ ఉంటానని” అని ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ అన్నారు.

పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ, నేను ప్రతిసారి కొంత స్క్రిప్ట్ రాసుకోవడం… కొన్ని రోజుల తర్వాత దాన్ని చించేయడం జరుగుతోంది. ఎందుకంటే, నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు పవన్ ను ఒక స్థాయిలో ఊహించి మొదలు పెడతాను. కొద్దో గొప్పో స్క్రిప్ట్ పూర్తయ్యే సరికి, మరి వైపు పవన్ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. దీంతో, రాసిన స్క్రిప్ట్ ను పక్కన పడేయటం… మళ్లీ కొత్తది మొదలుపెట్టడం జరుగుతోంది అని కోన వెంకట్ నవ్వుతూ చెప్పారు.

ఇక, తన పారితోషికం విషయమై… ‘పిండి కొద్దీ రొట్టె. ఏ ఫిల్మ్ కు ఎంత బడ్జెట్ ఉంటుందనే విషయం నాకు తెలుసు. ప్రొడ్యూసర్ ని పిండి వాళ్ల దగ్గర నుంచి వసూలు చేయను. మీరు ఎంత ఇవ్వగలుగుతామనుకుంటే అంతే ఇవ్వండని చెబుతాను. చిత్రం మార్కెట్ ను బట్టే వాళ్లు కూడా ఇవ్వగలుగుతారు. మీరు ఇంత ఇస్తేనే చేస్తా, లేకపోతే లేదు అని ఈ రోజు వరకు.. ఐ నెవర్ డిమాండ్’ అని ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో కోన వెంకట్ తన సినీ అనుభవాలను పంచుకున్నారు.