kona-venkatకొత్త సినిమా థియేటర్లలో పడిన వెంటనే… దానికి సంబంధించిన పైరసీలు వెబ్ సైట్లలో ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలైతే, విడుదలకు ముందే నెట్టింట అడుగుపెడుతున్నాయి. దీంతో కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు భారీ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు సినీ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు. ‘కేటీఆర్ గారూ, మూవీరూల్జ్ (movierulz) వెబ్ సైట్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు ఈ వెబ్ సైట్ ప్రతిబంధకంగా మారింది. వెబ్ సైట్ నిర్మాహకులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించండి.

సినీ పరిశ్రమకు మంచి చేయండి’ అంటూ విన్నవించారు. రిలీజైన ప్రతి సినిమా ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. వెబ్ సైట్లో ఉంచిన కొత్తగా రిలీజైన తెలుగు సినిమాల వివరాలను కేటీఆర్ కు తెలియజేశారు.