Kolusu-Parthasarathy“కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆడియో టేపులపై విచారణ చేపట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఓటుకు కోట్లు కేసులో బాబు ఆడియో టేప్‌లు 90 శాతం మ్యాచ్‌ అవుతున్నాయి. బాబు ఆడియో టేపుపై కూడా యనమల డిమాండ్ చేసి ఉంటే బాగుండేదని” వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి ఆరోపించారు.

అయితే పార్థసారధి లాజిక్ చాలా విచిత్రంగా ఉంది. ఓటుకు నోటు కేసు ఇప్పటికే విచారణలో ఉంది కదా. తెలంగాణ ఏసీబీ ఇప్పటికే ఒక ఛార్జ్ షీటు వేసింది చంద్రబాబును ఏ-1 ముద్దాయిని చేస్తూ ఇంకో ఛార్జ్ షీటు ఈ నెలాఖరు లోపే వేస్తారని వైకాపా వారి సాక్షి మీడియానే కోడై కూస్తుంది కదా.

దేశంలోనే రెండు ప్రసిద్ధ ఫోరెన్సిక్ ల్యాబ్లు ఆ టేప్ లో ఉన్నదీ చంద్రబాబు గొంతే అని సర్టిఫికెట్ ఇచ్చేసారు అని కూడా ఊదరగొడుతుంది సాక్షి. ఇప్పుడు కొత్తగా విచారణ ఏంటో? చంద్రబాబును, టీడీపీని విమర్శించేయ్యాలి చేసేసి తమ అధినేత మెప్పు పొందాలి అనే ఆత్రంలో వైకాపా వారికి లాజిక్కులు ఏమీ పట్టవు.