Kolusu parthasarathyఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచింది. ఈ క్రమంలో వారికి అమరావతి బాండ్లు దొరికాయి. పెద్ద పెద్ద సంఖ్యలు, సామాన్యులకు తెలియని విధానాలతో ప్రభుత్వం దుబారా, అవినీతి చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రచారాన్ని ప్రభుత్వం సాక్ష్యాలతో సహా ఖండించింది.

ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు దోచేసిన సొమ్మునే బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. తొమ్మిది మంది పెట్టుబడిదారులు ఈ బాండ్లను కొనుగోలు చేశారని,వారు ఎవరు అని ఆయన అన్నారు.వారంతా చంద్రబాబు కు సంబందించినవారేనని అధికార ప్రతినిది ,మాజీ మంత్రి కె.పార్దసారధి అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ఇది స్టాక్ ఎక్స్చేంజి పరిధిలో జరిగిన విక్రయమని అందులో అవకతవకలకు తావు ఉండదని ఆయన విస్మరించారు. రాష్ట్రంలో రిటైరైన వారు కాని, సామాన్యులు కాని డిపాజిట్ చేస్తే ఆరు శాతం వడ్డీ కూడా రావడం లేదని, వారికి ఈ బాండ్లు ఇస్తే ఉపయోగం జరిగేది కదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఇచ్చిన ఆ బాండ్లు విదేశీ మదుపరులకు, త్వరలో ఇక్కడ వారికి కూడా బాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి.