Virat-Kohli-40-crore-movieప్రపంచం క్రికెట్ మొత్తాన్ని ఊపేస్తున్న పేరు విరాట్ కోహ్లి. టన్నుల కొద్ది పరుగులు చేస్తూ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులకు వేదికగా అవుతున్న విరాట్ కోహ్లిని మించిన క్రికెటర్ ఉన్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం తేలికే గానీ, కోహ్లిని మించిన క్రికెట్ పిచ్చి ఈ యువకుడు సొంతం అని చెప్పవచ్చు.

రెండు చేతులు లేకపోయినా కాళ్ళతో బౌలింగ్ చేస్తున్న ఈ క్రికెటర్ కు నేటిజన్లంతా సలాం కొడుతున్నారు. తలకు, భుజానికి మధ్య బ్యాట్ పెట్టుకుని బ్యాటింగ్ చేస్తున్న వైనం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అన్ని సరిగా ఉన్న వారు కూడా కొట్టలేని షాట్లకు కొడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాడు ఈ యువకుడు.

అతను ఆటతీరుతో రూపొందించిన ఒక వీడియోను విరాట్ కోహ్లి స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంటులో పోస్ట్ చేసాడు. ఎప్పుడూ ఆశ కోల్పోకుండా ప్రయత్నం చేస్తున్న ఈ యువకుడికి హ్యాట్సాఫ్ చెప్పాడు విరాట్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క కోహ్లి ఏంటి మనసున్నోడు ఎవడైనా ఈ యువకుడికి సలాం కొట్టాల్సిందే.