Kodali Nani Responds on vizag steel plantఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కాక రేపుతోంది. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దానితో వైఎస్సార్ కాంగ్రెస్ ఈ విషయంలో దోషిగా నిలబడింది.

అయితే ఆ పార్టీ నాయకులు, మంత్రులు పెద్ద స్టేట్మెంట్లతో ప్రజలను ఊదరగొడుతున్నారు. మంత్రి కొడాలి నాని ఈ విషయంగా మాట్లాడుతూ… ఈ విషయంలో తమకు తప్ప ఎవరికీ చిత్తశుద్ధి లేదని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాతో కలిసి వస్తానంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా నేనే పోరాటం చేస్తా అంటూ ప్రకటించారు.

అయితే ఈ వ్యాఖ్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. “పెద్ద మగాడిని అన్నట్టు మాట్లాడతాడు కొడాలి నాని… ఇద్దరు జాకీలేసి లేపాలా?,” అంటూ కొందరు సోషల్ మీడియా సాక్షిగా ఎద్దేవా చేస్తున్నారు. “అధికారంలో ఉన్నది మీరా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లా అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… టీడీపీ విశాఖపట్నం పార్లమెంట్ ఇంఛార్జ్ పల్లా శ్రీనివాస రావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఇదే అంశంపై తాజాగా స్పీకర్ ఫార్మటు లో తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు.