Kodali Nani పెద్దంతరం చిన్నంతరం లేకుండా తరచు చంద్రబాబు మీద నోరుపారేసుకుంటారు మంత్రి కొడాలి నాని. సొంత పార్టీ వారు దానిని హీరోయిజం గా ప్రమోట్ చెయ్యడంతో మరింతగా రెచ్చిపోతుంటారు. అయితే ఆ క్రమంలో ఒక రేఖ దాటుతుంటారు అని మాములు ప్రజానీకంలో ఉన్న బలమైన అభిప్రాయం. అయితే అధికారంలో ఉండగా జనరల్ గా అటువంటివి కనపడనివ్వదు.

అయితే నానికి మాత్రం దానిపై ఒక ఇండికేషన్ వచ్చింది. ఆయన సొంత నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. 58 పంచాయతీలలో 20 స్థానాల్లో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌లు విజయం సాధించారు. ఆలస్యం గా తేరుకుని మంత్రిగారు నష్టనివారణకు దిగారని సమాచారం.

టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను తమ వారిగా చెప్పుకోవాలని ఒత్తిడి చెయ్యడం లేకపోతే కనీసం స్వాతంత్రులుగా గలిచామని చెప్పాలంటూ నేతలు వారిని బలవంతం చేస్తున్నారు. టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను తమ ఖాతాలో వైసీపీ నాయకులు వేసుకుంటున్నారు. మరోవైపు నాని సొంత ఊరిలో కూడా ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది.

పెదపారుపూడి మండలం యలమర్రు పంచాయతీపై టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. ఒకరకంగా ప్రజలు నానికి అనవసరమైన విషయాలు వదిలేసి సొంత నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలని మెస్సేజ్ ఇచ్చినట్టున్నారు అని టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు.