గుడివాడలో కాసినో వంటి వ్యవహారాలు ఏవీ జరగలేదు, కేవలం సంక్రాంతి కోడి పందాలు తప్ప అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముందుగా చెప్పిన విషయం తెలిసిందే. అక్కడ నుండి నేడు గుడివాడలో తన కోసమే వల్లభనేని వంశీ పెట్టించారు అని ఒప్పుకునే వరకు ఎన్ని మాటలు మార్చారో ఒక్కసారి గమనిస్తే…
గుడివాడలో అసలేమీ జరగలేదు, కోడి పందాలు తప్ప!
గుడివాడలో అలాంటివి జరిగాయని తెలిసి వెంటనే నేనే పోలీసులకు ఫోన్ చెప్పాను.
తన కే కన్వెన్షన్ సెంటర్ లో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసి అంటించుకుంటా.
తన కే కన్వెన్షన్ సెంటర్ పక్కనే ఉన్న దాంట్లో జరిగాయి, దానికి నాకేం సంబంధం లేదు.
ఎక్కడో షూటింగ్ చేసి అవి గుడివాడలో జరిగాయని చెప్తే దానికి నేనేం సమాధానం చెప్పాలి.
అంతిమంగా… తన మీద ఉన్న ప్రేమతోనే వల్లభనేని వంశీ గుడివాడలో పెట్టించారు.
ఇలా ఒక విషయంపై ఇన్ని మాటలు మార్చడం బహుశా వైసీపీ ట్రేడ్ మార్క్ రాజకీయమో ఏమో గానీ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొడాలి నాని వంటి వారికి మాత్రం తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రాజకీయాలపై ప్రజలలో ఏహ్యభావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… ఇలా ‘మాట తప్పుడు, మడమ తిప్పుడు’ రాజకీయాలపై ప్రజలకు ఏ మాత్రం ఆసక్తి లేదన్న విషయాన్ని మంత్రివర్యులు గమనించుకోవాలి.
గుడివాడ సీన్ లోకి వల్లభనేని వంశీ ప్రవేశించి, ఇదంతా తన అనుచురులు చేసిన విషయంగా చెప్పగా, దానిని ఇపుడు కొడాలి నాని ధృవీకరించారు. గుడివాడ ప్రజలకు సంక్రాంతి వినోదాన్ని అందించే క్రమంలో ఈ ఏర్పాట్లు జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. టీవీ9 చేపట్టిన ఓ చర్చలో భాగంగా ఈ విషయాన్ని స్వయంగా కొడాలి ఒప్పుకోవడంతో,దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి గారు ఒప్పుకున్నారు గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ తన కోసం పెట్టించాడు అని .. @APPOLICE100 ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.. pic.twitter.com/RXQBVmPf97
— NAME IS BSK (@SKBODDEDA) January 25, 2022
F3 Review, U.S Premiere Report, Updates
Akira Drops Pawan Kalyan’s Surname!