Kodali Nani Fires on Chandrababu Naiduజగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అధికారం వచ్చిన అహంతో ఏం మాట్లాడుతున్నారో కూడా చూసుకోకుండా మాట్లాడేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… చంద్రబాబు నాయుడు చేసిన ఇసుక దీక్ష మీద మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తిరుమల విషయంలో కూడా మాట్లాడటం గమనార్హం.

తిరుమల వెళ్ళేటప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి అనే దానిపై నాని పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. “ నీ యమ్మా మెుగుడు కట్టించాడా తిరుపతి గుడి ? ఎవడికి సంతకం పెట్టాలి ? ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి ? రాష్ట్ర పౌరుడిగా ఎక్కడికైనా వెళ్ళే హక్కుంది,” అంటూ విచక్షణ లేకుండా మీడియా ముందే విమర్శలు చేశారు.

నిజమే జగన్ తో పాటు అందరి పౌరులకు హక్కులు ఉంటాయి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. అయితే ప్రార్ధనా స్థలాలకు ఎవరు వెళ్లినా అక్కడి నియమాలను పాటించాల్సి ఉంటుంది. దానికి నాని గానీ, జగన్ గానీ ఇంకొకరు గానీ అతీతం కాదు. ఆ నియమాలు చంద్రబాబు గానీ, నాని ఆయన అన్నట్టు చంద్రబాబు యమ్మా మెుగుడు గానీ తీసుకొచ్చినవి కాదు.

ఆ నియమాలను అందరూ గౌరవించాలి. ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగన్ మరింతగా పాటించి అందరికీ ఆదర్శంగా ఉండాలి. లేదంటే అధికారం ఎటూ మనచేతిలోనే ఉంది కాబట్టి అటువంటి నియమాలను ఎత్తేస్తే సరి. కానీ ఆ నియమాలు ఉండి జగన్ పాటించనంతవరకూ వాటి ఉల్లంఘన చేసినట్టే. చంద్రబాబుతో సహా ఎవరికైనా స్పందించే అధికారం ఉంటుంది.

నోట్: ఆర్టికల్ లో కొన్ని పరుషపదాలు మంత్రిగారు చెప్పడంతో ప్రస్తావించక తప్పలేదు. విజ్ఞులైన పాఠకులు అర్ధం చేసుకోగలరు.