Kodali Nani-fires on chandrababu naidu amaravati tourప్రపంచంలో ఎక్కడా లేని వింత ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఆవిష్కృతం అవుతుంది. ఏ దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ప్రభుత్వాలు, మంత్రులు తమ సొంత రాజధానులను తక్కువ చేసుకుని మాట్లాడారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది. అమరావతిని కించపరచి మాట్లాడటానికి ఇక్కడ మంత్రులు పోటీ పడుతున్నారు.

మొన్న ఆ మధ్య మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని ఏకంగా శ్మశానంతో పోల్చారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ముఖ్యమంత్రి జగన్ మంత్రులను వారించే ప్రయత్నం చెయ్యలేదు. కట్టడి చేయకపోవడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మరో మంత్రి కొడాలి నాని అమరావతిని కించపరిచేలా మాట్లాడారు.

రాజధానిలో నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్ల పొదలు తప్ప ఏమున్నాయని ఆయన అన్నారు. వాటిని చూడ్డానికి చంద్రబాబు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి అదే తుప్పలు, ముళ్ల పొదలు నుండి పాలన సాగిస్తున్నారు.

చంద్రబాబు మీద వైఎస్సార్ కాంగ్రెస్ వారికి అక్కసు ఉండుగాక, రాజకీయ విబేధాలు ఉండు గాక, అయితే రాజధానిని విమర్శించడం తగదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ని రాజధాని గా చేసింది చంద్రబాబు కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు అయినా వారిద్దరు అక్కడ నుండే పని చేశారు. ఎప్పుడు ఇటువంటి మాటలు అయితే మాట్లాడలేదు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల జాతీయ స్థాయిలో, పెట్టుబడి దారులలో పలచన అవుతాం.