Kodali-Naniటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో పర్యటిస్తూ ఇవే నా చివరి ఎన్నికలని చెప్పడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ, “పై నుంచి కోడెల పిలుస్తున్నారేమో?” అంటూ చాలా అనుచితంగా సందేశం పెట్టారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులు భరించలేక మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొన్నారు. అందుకు విజయసాయి రెడ్డి సిగ్గుపడకపోగా చనిపోయిన కోడెల దగ్గరకు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళిపోతారన్నట్లు ట్వీట్ చేయడం చాలా నీచాతినీచమైన ఆలోచనే అని చెప్పవచ్చు.

అయితే వైసీపీ ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తున్నట్లు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ బూతుల మంత్రి కొడాలినాని ఆసుపత్రి పాలయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనని హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. శుక్రవారం రాత్రి వైద్యులు ఆయనకి కిడ్నీ సంబందిత శస్త్ర చికిత్స కూడా చేశారు. మరో 3-4 రోజులలో కోలుకొన్న తర్వాత హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.

ఆ తర్వాత రెండు మూడు వారాలు ఇంట్లో పూర్తి విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. మూడు వారాల తర్వాత ఎటువంటి సమస్య లేదనుకొంటే మళ్ళీ మరోసారి లేజర్ చికిత్స చేయవలసి ఉంటుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం కూడా కొడాలి నాని హటాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్సతో మళ్ళీ కోలుకొన్నారు. కానీ మూడు రోజుల క్రితం మళ్ళీ హైదరాబాద్‌ అప్పోలో హాస్పిటల్‌ చేరి శాస్త్ర చికిత్స చేయించుకొన్నారు.

వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు చనిపోవాలని కోరుకొంటుంటే, వైసీపీలో ముఖ్య నేత కొడాలి నాని ప్రాణాలు కాపాడుకోవడానికి అత్యవసరంగా హాస్పిటల్లో చేరి శస్త్ర చికిత్సలు చేసుకోవలసి రావడం దేవుడి స్క్రిప్ట్ కాకపోతే మారేమిటి? కానీ టిడిపి నేతలు ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ యాక్టివ్‌గా రాజకీయాలలో పాల్గొనాలని, వచ్చే ఎన్నికలలో ఆయనను తాము ఓడించాలని కోరుకొంటున్నారు.

మరో విషయం ఏమిటంటే వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో చాలా అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకొనే వైసీపీ నేతలు అనారోగ్యం పాలైతే హడావుడిగా హైదరాబాద్‌కి పరుగులు తీస్తుండటం గమనిస్తే ఏపీ ఇంకా ఎంత వెనకబడిపోయి ఉందో అర్దం అవుతుంది.