Kodali Nani abusive Press Meet after a long gapఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు రావడం లేదు. ఇంతటి కీలక శాఖా మంత్రి విపత్తు సమయంలో ఏమైపోయారని కొన్ని మీడియా ఛానెల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా వేశాయి. దీనితో ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. రేషన్ వాలంటీర్లతో ఇంటికి పంపకుండా ప్రజలని ఈ సమయంలో లైన్ లలో నిలబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దీనిపై నాని తన దైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ విషయం పై ప్రశ్నించిన టీడీపీ సీనియర్ నేతలు … దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై బూతు పురాణం మొదలు పెట్టారు. “అప్పట్లో వాలంటీర్లను రౌడీలు, గుండాలు అని ఇప్పుడు వారు రేషన్ ఇవ్వడం లేదని వారి సంక నాకడానికి దేవినేని ఉమ గాడు, సొల్లు సోమిరెడ్డి గాడు రెడీ అయిపోయారు,” అంటూ చీప్ కామెంట్స్ చేసారు.

ఇటువంటి విపత్తు సమయంలో, తన శాఖలో స్పష్టంగా తప్పు జరిగినా, దిద్దుకునే ప్రయత్నం చెయ్యకుండా రాజకీయ విమర్శలు చెయ్యడానికే పరిమితం కావడం శోచనీయం. మంత్రి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకూ ఏపీలో ఏకంగా 17 కేసులు నమోదు అయ్యాయి.

అన్నీ ఢిల్లీ మత ప్రచార సభకు చెందినవే. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా వైరస్ కేసులు నలభైకు చేరాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటి సారి. దీనితో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ముందుముందు ఏమవుతుంది అనే భయం అందరిలోనూ ఉంది.