Kodali Nani about 2019 electionsవినడానికి… ఊహించుకోవడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ… ఈ వ్యాఖ్యలను వైసీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. “విజయవాడలో కొత్త పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడానికి తమ వద్ద డబ్బులు లేవని, అంత శక్తి తమకు లేదని, కనీసం అద్దె భవనాలు తీసుకుందామన్నా, అధికార పార్టీ అందుకు అడ్డుపడుతోందని, తమకు అద్దెకు భవనాలు దొరకకుండా చేస్తోందని” అధికార పార్టీపై మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు కొడాలి నాని.

అయితే ఇది విన్నవారంతా ‘అయ్యో… వైసీపీకి ఎంత కష్టం వచ్చింది… ఆ పార్టీ నేతల పరిస్థితి ఏం కానూ…’ అంటూ జాలిని ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునే శక్తి లేని పక్షంలో… మరి ఈ మూడేళ్ళ పాటు పార్టీని నడపడం కూడా కష్టమవుతుందేమో..! బహుశా అందుకే వైసీపీ నేతలంతా ప్రత్యామ్నాయాలను చూసుకునే పనిలో ఉన్నట్టున్నారు… ఒకవేళ ఈ మూడేళ్ళ పాటు పార్టీని నడిపినా… వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికైనా ఆర్ధిక స్తోమత కావాలి కదా..! అంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ పోటీ చేయదేమో అంటూ నెటిజన్లు కొడాలి నాని వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తున్నారు.

ఒకవేళ పోటీ చేస్తే… ఈ మూడేళ్ళల్లో అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందో వైసీపీ నేతలు చెప్పాల్సి ఉంటుంది. పార్టీ కార్యాలయం నిర్మాణానికే డబ్బులు లేని నేతలకు పార్టీ తరపున పోటీ చేసేటంతగా ఎలా ఆర్జించారో ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని పరిశీలకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఏదో చెప్పబోయి… ఎవరినో విమర్శించబోయి… ఆవేశంలో ఏదో మాట్లాడమంటే ఇదేనేమో… నాని గారు… కాస్త ఆలోచించండి..!