Kobbari Mattaబర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా సుమారు నాలుగైదు సంవత్సరాల నుంచి తెరకెక్కుతోన్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఈ సినిమా దుమ్ము దులిపి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. రేపు అధికార ప్రకటన ఉండొచ్చని సమాచారం. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపిస్తూ తనదైన శైలిలో బిల్డప్ ఇవ్వబోతున్నాడట.

‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత హీరోగా ఏ ప్రాజెక్టు చేయని సంపూ… కొన్ని మూవీల్లో క్యారెక్టర్లు చేశారు. అయితే అవి ఏవి వర్క్ అవుట్ కాలేదు. దానితో తాను ముచ్చటగా మూడోసారి హీరోగా చేస్తున్న సినిమా కొబ్బరి మట్ట. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది.

ఈ సినిమా ఆడితేనే సంపూర్ణేష్ బాబుకు ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ హీరో అయిన సంపూ మొన్న ఆ మధ్య ఆంధ్ర వెళ్లి ఉద్యమంలో పాల్గొని అరెస్టు కూడా అయ్యాడు. దీనితో రెండు రాష్ట్రాల ప్రజలకు అతని మీద అభిమానం ఉందట. ప్రస్తుతానికి జులై 19కు ఎటువంటి సినిమా రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించలేదు. అయితే ఆ ముందు రోజు బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.