KK-Radhamohan-Targets Mahesh Babuమాస్ మహారాజా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ వంటి మాస్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ అందుకున్న నిర్మాత కేకే రాధామోహన్, తాజాగా “మీలో ఎవరు కోటీశ్వరుడు” వంటి చిన్న సినిమాను నిర్మించారు. పృధ్వీ, నవీన్ చంద్రలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం విడుదల కానుండడంతో, ప్రమోషన్స్ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఇచ్చిన ఓ ప్రెస్ మీట్ లో తన డ్రీం ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు సదరు నిర్మాత.

ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనేది తన డ్రీం అని, సరైన కధ, దర్శకుడు కుదిరితే ప్రిన్స్ ఎప్పుడంటే అప్పుడు తానూ సిద్ధమని, అయితే ఎలాగైనా మహేష్ ఓ సినిమాను నిర్మించాలనేది తన టార్గెట్ అన్నట్లుగా రాధామోహన్ చెప్పుకొచ్చారు. మరి మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా నిర్మించాలన్న అభిప్రాయంతో ఉన్న సదరు నిర్మాత, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి చిన్న సినిమాను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో కూడా తెలిపారు.

ఈ సినిమా కధే తనను ప్రోత్సహించిందని, దర్శకుడు సినిమాను చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారని అన్నారు. తానూ నటించిన సినిమాలు సక్సెస్ కాలేదన్న సెంటిమెంట్ ఒక వైపు, తానూ నటించని ‘బెంగాల్ టైగర్’ సక్సెస్ కావడం మరో వైపు ఉండడంతో, ఈ సినిమాలో కూడా సెంటిమెంట్ రీత్యా తానూ నటించలేదని రాధామోహన్ తెలిపారు. ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్లు సాధారణమే కదా!