kisses-making-video-24-kisses-adith-arun-hebah-patelసినిమా ప్రమోషన్ లో భాగంగా మేకింగ్ వీడియోలను విడుదల చేసి ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడం రోటినే. అయితే ఈ మేకింగ్ వీడియో హాట్ హాట్ గా ఉంటే…. అప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం “24 కిస్సెస్” మేకింగ్ వీడియో కూడా అలాంటి సందడే చేస్తోంది. నవంబర్ 23వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా మేకింగ్ లో మొత్తం ముద్దులే కనపడుతున్నాయి.

‘హౌ 24 కిస్సెస్ మేడ్?’ అన్న ప్రశ్న వస్తే… సమాధానమే ఈ వీడియో. అదిత్ అరుణ్ – హేబా పటేల్ ల మధ్య ముద్దు సన్నివేశాలను సిల్వర్ స్క్రీన్ పై చూపించడానికి హీరోహీరోయిన్లతో సహా చిత్ర యూనిట్ ఎలా కృషి చేసిందో ఈ మేకింగ్ చెప్తుంది. ఈ ముద్దు సీన్లే సినిమా ప్రమోషన్ కు పెట్టుబడిగా మారాయని చెప్పడంలో సందేహం లేదు.