Kishan Reddy responds on KCR Narendra Modi Meetజీహెచ్ఎంసీ ఎన్నికల వేడి చల్లారాక ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నఫళంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం విదితమే. ఈ పర్యటనలో ఢిల్లీ పెద్దలకు బీజేపీ కి జీహెచ్ఎంసీ మేయర్ సీటు ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ చెప్పి వచ్చినట్టు సమాచారం.

దీని మీద సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా మీట్‌లో స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్‌తో బీజేపీకి రాజీ కుదిరిందనే ప్రచారాన్ని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ గురించి కేంద్ర మంత్రిని విలేకర్లు అడగ్గా.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో ఢిల్లీలో కేసీఆర్ ఏమి మాట్లాడారో ఆయన్నే అడగండి అని బదులిచ్చారు. రైతులకు అనుకూలంగా ఉన్న చట్టాలు తెచ్చినా తెరాస బంద్ చెయ్యడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

“టీఆర్ఎస్ చేసింది రైతుల బంద్ కాదు.. సర్కారీ బంద్,” అని ఆయన అన్నారు. మరోవైపు…. కేసీఆర్ ఢిల్లీ విమానం దిగిన కాసేపటికే ఇక్కడ్నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హస్తినకు వెళ్లడం కూడా చర్చనీయాంశమే అయ్యింది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇరుపక్షాల వారు పెదవి ఇప్పకపోవడం కొసమెరుపు.