Kishan- Reddy - BJPఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ హిందూ ముస్లిం కార్డును ప్రయోగించి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణా బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత, బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి ముస్లిమ్ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించి హిందువులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

తెలంగాణాలో తమ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిములకు విద్యా, ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. ముస్లిముల రిజర్వేషన్ రద్దుపైనే మొదటి సంతకం చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ మండలంలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణాలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఆ పార్టీ సొంతగా గత ఎన్నికలలో గెలిచినా ఐదు సీట్లను కూడా నిలబెట్టుకునే అవకాశం కనిపించడం లేదు. దీనితో వారికి బాగా అచ్చొచ్చిన బీజేపీ హిందూ ముస్లిం కార్డును వాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణాలో మూడు చోట్ల ఎన్నికల సభలు పెడతారట. హైదరాబాద్, నిజామాబాదు, సూర్యాపేటలలో ఈ సభలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఎంఐఎం ఇలాకా ఐన హైదరాబాద్ లో మోడీ సభ పెట్టడానికి కూడా ఇదే కారణం.