Kiran Kumar reddy not contesting for elections---మొన్న ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టీవ్ గా ఏమీ లేరు. ఎప్పుడో ఒకటి అరా సందర్భాలలో తప్ప బయటకు రావడం లేదు. మరోవైపు పార్టీ ఈ నెలాఖరు నుండే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెబుతుంది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాంగ్రెస్‌ తరఫున పోటీకి రాష్ట్రవ్యాప్తంగా 1,271 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నెల 7 నుంచి 10 వరకూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 175 శాసనసభ స్థానాలకు 1,090 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 181 మంది ముందుకొచ్చారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోకాకపోవడం విశేషం. దీని బట్టి ఆయన అస్త్రసన్యాసం చేసేశారా అనే అనుమానాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఆయన కాంగ్రెస్ ను విడీ టీడీపీలో చేరతారు అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి.

టీడీపీలో చేరి తన ప్రత్యర్థయిన పెద్దిరెడ్డి కుటుంబంపై రాజంపేట పార్లమెంట్ కు పోటీ చేస్తారని వినిపిస్తుంది. కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ పదవి పొందారు. ఆయన వచ్చే ఎన్నికలలో కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరు నుండి పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. కిరణ్ పోటీ అంటూ చేస్తే టీడీపీ నుండే చేస్తారని లేకపోతే ఈ ఎన్నికలలో కూడా 2014 ఎన్నికల లాగే తెర వెనుకే ఉండిపోతారని తెలుస్తుంది.