kings xi punjab vs hyderabad sunrisers IPL 2017మ్యాచ్ లు గడుస్తున్న కొద్దీ టాప్ 4లో చివరి స్థానం కోసం జరుగుతున్న రసవత్తర పోరు ఉత్కంఠకు తెరలేపుతోంది. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కావాల్సిన నాలుగు జట్లల్లో మూడు జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. కోల్ కతా, ముంబై, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్ళడం దాదాపుగా ఖాయంగానే మారిన తరుణంలో… నాలుగవ స్థానం కోసం మాత్రం పూణే, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లలో సైతం ఈ నాలుగు జట్ల ఓటమి పాలు అవుతుండడంతో… ఈ ఒక్కస్థానం కోసం జరుగుతున్న పోటీ మరింత రసకందాయంలో పడింది.

తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సైతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇదే రీతిన ఓటమి పాలయ్యింది. వార్నర్ (51), ధావన్ (77), విలియమ్సన్ (54)ల ధాటికి హైదరాబాద్ జట్టు 207 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. భారీ లక్ష్య చేధనలో పంజాబ్ బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (84) మినహా మిగతా బ్యాట్స్ మెన్లందరూ చేతులెత్తేయడంతో… నిర్ణీత ఓవర్లలో 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ గెలుపుతో 9 మ్యాచ్ లలో మొత్తం 11 పాయింట్లు సాధించి హైదరాబాద్ మూడవ స్థానంలో నిలువగా, పంజాబ్ 8 మ్యాచ్ లలో 6 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచింది.