Kiara Advani to romance allu arjun next movieకొరటాల శివ – మహేష్ బాబుల “భరత్ అనే నేను” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కైరా అద్వానీ, ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో హాట్ కేక్ లాంటి డిమాండ్ ఉన్న హీరోయిన్. హిందీలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న ఈ బ్యూటీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్ లో నటిస్తుండగా, అక్షయ్ కుమార్ సరసన నటించే మరో బడా ఛాన్స్ కూడా కొట్టేసినట్లు సమాచారం.

బాలీవుడ్ కబుర్లు ఇలా ఉంటే, తెలుగులో ఇప్పటికే రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో కనిపిస్తోన్న ఈ బ్యూటీ, అల్లు అర్జున్ తదుపరి సినిమాకు ఎంపికైనట్లుగా తెలుస్తోంది. అలాగే మరోసారి ప్రిన్స్ మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని ఈ బ్యూటీ అందిపుచ్చుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సుకుమార్ – మహేష్ ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా అద్వానీనే ఫైనల్ చేసినట్లుగా టాక్.

ఇదే జరిగితే టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ స్థానం సంపాదించుకోవడానికి ఎన్నాళ్ళో పట్టకపోవచ్చు. చెర్రీ, బన్నీ, ప్రిన్స్… ఇలా వరుస అగ్ర హీరోల సినిమాలలో నటిస్తూ ఉంటే, మిగిలిన హీరోల సినిమాలు కూడా ఆటోమాటిక్ గా క్యూ కడతాయి. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ లో ఫోకస్ చేస్తుందా? టాలీవుడ్ లోనా? అన్నది మాత్రం వేచిచూడాల్సిన విషయం. ఒకవేళ బాలీవుడ్ లో భారీగా క్లిక్ అయితే టాలీవుడ్ ను లైట్ తీసుకోవడం రొటీన్ గా జరిగే విషయమే.