kia-motors-andhra-pradesh‘హ్యుండయ్’ సోదర సంస్థ అయిన ‘కియా మోటార్స్’ నవ్యాంధ్రలో కార్ల పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఈ సంస్థను ఆహ్వానించగా, భారీ పెట్టుబడులతో అనంతపురం లేదంటే నెల్లూరు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ చెచీల్ స్ర్పాగ్ర్యూ మరియు మరికొందరు ప్రతినిధులతో కలిసి గురువారం నాడు అనంతపురంలో పర్యటించారు.

మరో వైపు నెల్లూరులోనూ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న స్థలాలను ‘కియా’ పరిశీలించింది. అయితే పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కియా ప్రతినిధుల మధ్య జరగనున్న కీలక సమావేశంలో ఈ విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. స్పోర్టేజ్, రియో, సోల్ పేరిట ఎస్‌యూవీలు, హ్యాచ్‌ బ్యాక్ కార్లను ఉత్పత్తి చేస్తున్న కియా రాష్ట్రంలో అడుగుపెడితే వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.