Ganesh Nimajjanam Public Opinion Talk Hyderabad cityగణేష్ ఉత్సవాలలో దేశంలోనే భాగ్యనగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ ఖైరతాబాద్ వినాయకునికి ప్రత్యేక గుర్తిపు ఉంటుంది. నిమజ్జనోత్సవం జరిగే తరువాతి రోజు ఉదయాన మాత్రమే ఎప్పుడూ ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తవుతుంది. అయితే అందుకు భిన్నం గా ఈ సారి మాత్రం భాగ్యనగర వాసుల కోరిక నేరవేరిందనే చెప్పాలి.

ఎందుకంటే ఎప్పుడూ ఖైరతాబాద్ గణపతి శోభాయత్ర అర్ధరాత్రి నుండి మొదలవడంతో చాలా మందికి ఆ శోభయాత్రలో పాలు పంచుకొనే అవకాశం లేకపోయేది. అయితే ఈ సారి హైదరాబాద్ జి.హెచ్.ఎం.సి. అధికారుల,పోలీస్ వారి ముందస్తు సూచనల మేరకు ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర ను మాత్రమే కాకుండా ఆ గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చూసే అవకాశం భాగ్యనగర వాసులకు దక్కిందనే చెప్పాలి. చరిత్రలో తొలిసారి ఖైరతాబాద్ గణపతి అనుకోన్నరోజే నిమజ్జన ప్రక్రియ పూర్తీ చేసుకోనున్నాడు.

ఈ విధంగా 2016 లో ఖైరతాబాద్ గణపతి కొత్తగా చరిత్ర ఖరారు చేసుకున్నారనే చెప్పాలని హైదరాబాద్ వాసులే కాదు మన తెలుగు వారంతా చెప్పక తప్పదు. అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలని అందరం ఆశిద్దాం.

“జై భోలో గణేష్ మహరాజ్ కి జై”.

Kakarla