ఖైదీ ట్రైలర్: నో రొమాన్స్ ఓన్లీ యాక్షన్

Khaidi-Telugu-Trailer-Talk--Thrilling-But-Revealingతమిళ నటుడు కార్తీ తాజా సినిమా ‘ఖైదీ’ తెలుగు ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా పూర్తిగా డ్రగ్ మాఫియా నేపథ్యంగా, కొంత ఫ్యామిలీ సెంటిమెంట్‌తో సాగుతున్న థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. కార్తీ పూర్తిగా మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ట్రైలర్‌లో ‘దిల్లీ’ అనే ఖైదీ పాత్రలో కార్తీ నటించాడు.

ట్రైలర్‌లో కార్తీ ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు కదా సార్‌‌’ అంటూ చెప్పిన డైలాగులు మాస్‌ను ఆకట్టుకోనున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ పూర్తీగా యాక్షన్‌ ప్రియులను అలరించే విధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గానీ, రొమాన్స్ గానీ, పాటలు గానీ ఉండవని కార్తీ తెలిపాడు.

కథ అంతా ఒక రాత్రి జరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. సినిమాలోని యాక్షన్ పార్ట్, కెమెరా వర్క్ అదిరిపోయాయి. అయితే ట్రైలర్ చుసిన వారికి సినిమాలో ఉన్న మొత్తం విషయాన్నీ ఎటువంటి సస్పెన్స్ లేకుండా బయటపెట్టేశారా అనే అనుమానాలు కలగకమానదు. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా డ్రీమ్ వారియర్ పిక్ఛర్ సంస్ధ నిర్మిస్తోంది.

ఖైదీని దీపావళికి విడుదల చేయాలనీ చూస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే దీపావళికి విజయ్ బిజిల్ (విజిల్ తెలుగులో) కూడా విడుదల కావడంతో పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. తెలుగులో వెంకీ మామ వాయిదా పడటంతో పెద్దగా మనవైపు నుండి పోటీ ఉండదనే చెప్పుకోవాలి.

Follow @mirchi9 for more User Comments
Venky Mama -Trailer TalkDon't MissTrailer Talk: A Formulaic Yet Colourful Commercial BlastIf the footage and music that has come out from Venky Mama didn’t give clarity...Mathu Vadalara Movie Teaser |Don't MissTeaser Talk: Slick And Instantly IntriguingThe teaser of a new film from Mythri Movie Makers is out. If you thought...Under Public Pressure, Jagan Stops Splurging Public MoneyDon't MissUnder Public Pressure, Jagan Stops Splurging Public MoneyAndhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy is one of the Richest Politician in...Ala Vaikunthapurramloo -NetflixDon't MissNegative Report Planted Against Allu Arjun?According to a report in a popular English tabloid, there is a report stating that...madhanam Telugu 2019 Movie ReviewDon't MissMadhanam Review - Depressingly BoringBOTTOM LINE Depressingly Boring OUR RATING 1.75/5 Run Time 2hrs What Is the Film About?...
Mirchi9