khaidi-no-150-second-song-50-lakhs-clicksపదేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకు సంబంధించి యూ ట్యూబ్ లో ఇప్పటికే పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. రోజులు గడుస్తున్న కొలదీ ఆ రికార్డులు మరింత పదిలంగా మారుతున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలోని మొదటి పాట సంగీత సాహిత్య ప్రియులను పెద్దగా అలరించకపోయినా, మాస్ ప్రేక్షకుల, మెగా అభిమానుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ సాధించింది.

రెండవ పాట విడుదల కాక ముందే, ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే మొదటి పాట యూ ట్యూబ్ లో ఏకంగా 50 లక్షల క్లిక్స్ పైనే అందుకోవడం విశేషం. మరికొద్ది గంటల్లో రెండవ పాట విడుదల కానున్న నేపధ్యంలో… 5 మిలియన్ క్లిక్స్ అందుకున్న వార్త మెగా అభిమానులను మరింత ఉత్తేజంలో ముంచెత్తుతోంది. ఒక ఆడియో సాంగ్ కు ఈ రేంజ్ లో క్లిక్స్ అందుకున్న తొలి పాటగా ‘ఖైదీ నంబర్ 150’ రికార్డు సృష్టించింది. అంటే ఈ సినిమా పాటలపై మెగా అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అర్ధమవుతోంది.