khaidi-no-150-public-responseభారీ అంచనాలతో విడుదలైన మెగా మూవీ “ఖైదీ నంబర్ 150” సినిమా అన్ని వర్గాల వారిని మెప్పించిందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే, ఈ సినిమాను చూసి పండగ చేసుకుంటున్న మెగా అభిమానులకు కొదవలేదు. మెగాస్టార్ నుండి ఏయే అంశాలను అభిమానులు ఆశిస్తారో, వాటినన్నింటిని పుష్కలంగా వేసి సిల్వర్ స్క్రీన్ పైకి వదిలిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్ర యూనిట్ కు, మెగా ఫ్యాన్స్ నుండి విపరీతమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా మెగా ఫ్యాన్స్ హంగామానే కనపడుతోంది.

మెగాస్టార్ ను చూసి సంక్రాంతి పర్వదినాన్ని మూడు రోజుల ముందుగానే ఫ్యాన్స్ జరుపుకుంటుండగా, మరికొందరు బాగా ఏమోషనల్ అయిపోయి, ప్రస్తుత “ఖైదీ నంబర్ 150”ని వదిలేసి, గత పది సంవత్సర కాలాన్ని తలచుకుంటూ ఏడ్చేస్తున్నారు. ఇంతకాలం తమను విడిచి మెగాస్టార్ ఎందుకు ఇలా ఉన్నారంటూ ధియేటర్ల వద్ద కన్నీటి పర్యంతం అవుతున్నారు. మీడియా వర్గాలు సైతం సదరు అభిమానిని ఓదార్చే ప్రయత్నం చేసినా… అతను మాత్రం అలాగే ఏడుస్తూ మెగాస్టార్ ను తలచుకోవడం విశేషం.