khaidi-no-150-chiranjeevi-kajal-agarwal-shoot-picమెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం యూరోప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఖైదీ నంబర్ 150తో కాజల్ వేస్తున్న చిందులు అభిమానులకు కన్నుల పండగగా ఉంటాయని ఇప్పటికే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పష్టం చేసిన నేపధ్యంలో తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

చిరంజీవి, కాజల్ జంట ఎలా ఉంటుంది అనే సందేహాలను నివృత్తి చేసే విధంగా… వీరిద్దరూ కలిసి దిగిన ఓ స్నాప్ ను మెగా అభిమానులు షేర్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్న పాటలకు మెగాస్టార్ – కాజల్ జంట కన్నులవిందుగా మార్చేస్తాయని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది.