Khaidi No 150 Censor Reportఏదైనా పెద్ద సినిమా సెన్సార్ పూర్తి కావడం ఆలస్యం, దానికి సంబంధించి ‘సెన్సార్ రిపోర్ట్స్’ అంటూ సినిమాకు రివ్యూలు ఇచ్చేయడం ఇటీవల కాలంలో షరామామూలుగా మారిపోయింది. అందులో మెగాస్టార్ 150వ ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించి ‘సెన్సార్ రిపోర్ట్స్’ ఈ సినిమాలోని హైలైట్స్ అండ్ డిఫెక్ట్స్ అంశాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను మంజూరు చేసిందని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది.

ఇదిలా ఉంటే… మెగాస్టార్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సినిమాలో హైలైట్స్ గా – మెగాస్టార్ అభినయం, అతిధులుగా ఎంట్రీ ఇచ్చిన వారి పాత్రలు, ఇంటర్వెల్ బ్యాంగ్, రాజకీయ పరమైన డైలాగ్స్, మెగాస్టార్ డ్యాన్స్ లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక, సినిమాలో మైనస్ గా – దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విలన్, కామెడీ పండకపోవడం అని టాక్. ఓవరాల్ గా ‘డీసెంట్ ఫిల్మ్’ అన్న టాక్ రాగా, మెగా ఫ్యాన్స్ కు మాత్రం కన్నులవిందుగా ఉంటుందనేది ఫ్యాన్స్ కు కావాల్సిన అసలు విషయం.

అయితే ఇదంతా వాస్తవం అయితే… నిజంగా మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండేవి కావు. బహుశా సమాచారం లీకై, ముందుగానే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందా? ఏమో ప్రస్తుతానికి చెప్పలేం గానీ, సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే. అయితే చిత్ర యూనిట్ చేస్తోన్న పబ్లిసిటీ రీత్యా మెగా అభిమానులు మాత్రం కన్నులవిందుగా ఉండడం ఖాయమన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో కూడా వినపడుతోంది. కానీ, ‘కబాలి’ వంటి భారీ సినిమాలకు కూడా ఇలాగే ప్రచారం జరగడం, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద కుదేలు కావడం తెలిసిన విషయాలే.